గెస్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు

82చూసినవారు
గెస్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు
పెద్దపంజాణి మండల పరిధిలోని శంకర్రాయలపేట వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, తెలుగు సబ్జెక్టుల్లో గెస్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జ్యోష్ణ శనివారం పేర్కొన్నారు. పీజీ, డిగ్రీ, బి. ఈడి. ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసిన మహిళలు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 3 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్