పలమనేరు పట్టణంలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుండి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. అయితే మామిడి రైతులు మాత్రం కాస్త కంగారు పడుతున్నారు. ఎందుకంటే మామిడికాయలు రాలిపోతాయని బాధపడుతున్నారు. ఏది ఏమైనా ఈ వర్షం వల్ల వాతావరణం కాస్త చల్లబడటంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.