ఎద్దు పొడిచి వ్యక్తి మృతి

77చూసినవారు
ఎద్దు పొడిచి వ్యక్తి మృతి
ఎద్దు పొడిచి వ్యక్తి మృతి చెందిన ఘటన బైరెడ్డిపల్లెలో బుధవారం జరిగింది. బైరెడ్డిపల్లెకు చెందిన జయచంద్రానాయుడు (37) గ్రామ సమీపంలోని పొలం వద్దకు ఎద్దును మేతకు తీసుకెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఎద్దు పొడిచింది. దీంతో తీవ్రగాయాలవ్వడంతో అక్కడి రైతులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. స్థానిక వైద్యాధికారి విజయచందర్ అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్