పలమనేరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 203 కేసులు పరిష్కరించామని సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు, బీఎస్‌ఎన్‌ఎల్ కేసులు ఇందులో ఉన్నాయి. వీటి విలువ రూ. 1.13 కోట్లకు పైగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ జడ్జి లిఖిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్. భాస్కర్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.