హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ తెలిపారు. గురువారం వీ. కోట పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ చింతలఎల్లాగరకు చెందిన నవాజ్ బాషా, సర్దార్ స్నేహితులు ఆర్థిక లావాదేవీల వివాదాల నేపథ్యంలో ప్రణాళిక ప్రకారం సర్దార్, నవాజును ఈనెల 21న చేపల వేటకు తీసుకువెళ్లాడు. అక్కడ కొయ్యతో తలపై కొట్టడంతో నవాజ్ మృతి చెందాడు. నిందితుడు పట్రపల్లి సమీపంలో ఉండగా అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.