చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో అంబేడ్కర్ 134వ జయంతిని సోమవారం ఘనంగా జరిగింది. పలు కార్యాలయాల్లో ఆయన సేవలను స్మరించుకున్నారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మేల్యే అమరనాథ్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.