గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు శుక్రవారం మోహిని అవతారంలో కోనేటిరాయ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. మేళ తాళాల మధ్య మాడవీధుల్లో స్వామివారు విహరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అడుగడుగునా కర్పూర హారతులు ఇచ్చారు.