పలమనేరు: సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం

68చూసినవారు
పలమనేరు: సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం
చిత్తూరు జిల్లా, గంగవరం మండలంలోని అటుకురాళ్లపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాసులు రెడ్డి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి బుధవారం చెరువులో మునిగిపోయిన విషయం తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది వ్యక్తి మృతదేహాన్ని గురువారం వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసులు రెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

సంబంధిత పోస్ట్