పలమనేరులో ఓ ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య మంగళవారం గొడవ జరిగింది. మదనపల్లి రోడ్డులో మళ్లీ గొడవపడడంతో ఆపడానికి వెళ్లిన పోలీసులపై పలువురు తిరగబడడంతో ముగ్గురు సీఐలు రంగంలోకి దిగారు. గొడవ పడినవారి కోసం పలమనేరు పోలీసులు ప్రతి ఇల్లు సోదా చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారి కోసం ఆరా తీస్తున్నారు. గొడవకు గల కారణాలను ఏంటా అని ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.