పలమనేరు పట్టణంలోని గంగమ్మ జాతర ఏర్పాట్లను ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని జాతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జాతరలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.