పలమనేరు రంగాపురం అంగన్వాడి కేంద్రంలో శనివారం కిశోర వికాస కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్త చిలకమ్మ మాట్లాడుతూ మైనర్ బాలికలకు వివాహాలు చేయడం వలన సదరు బాలికకు ఆరోగ్యం క్షీణిస్తూ బలహీనులు అవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కిశోర బాలికల పట్ల మంచి ఉద్దేశంతో ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.