బైరెడ్డిపల్లి మండలంలోని పాతూరు నత్తం గ్రామంలో శ్రీ రేవన్న సిద్దేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ తొలి ఏకాదశి సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బీజే అనిల్ తో బాటు బీసీ నాయకులు ఆరేళ్ల జయప్ప, నాగభూషణం గౌడ్, జై కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ దేవాలయంలో ఉదయం నుంచి పూజలు, అర్చనలు చేసి స్వామికి నైవేద్యం సమర్పించుకున్నారు.