పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని మేలుమాయి పంచాయతీ హరిజనవాడకు చెందిన వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత ఎల్లప్ప ఇటీవల స్వర్గీయులయ్యారు. శనివారం మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఆయన నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల, పంచాయతీ నాయకులు పాల్గొన్నారు. ఎల్లప్ప సేవలను గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.