గత సంవత్సరం అక్టోబర్ తరువాత రిటైరైన వారికి వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని పలమనేరు పెన్షనర్ల సంఘం అధ్యక్షులు సోమచంద్రారెడ్డి ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పెన్షనర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ గ్రాట్యుటీ చెల్లింపులు నిలిపిన దాఖలాలు లేవన్నారు. అదే విధంగా పీఆర్సీ ఆలస్యం కావడం వలన రిటైర్ అవుతున్న ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతున్నారన్నారు.