పలమనేరు: జగన్ సీఎం అవ్వడం ఖాయం: మాజీ ఎమ్మెల్యే

52చూసినవారు
రానున్న రోజుల్లో వైసీపీ అధినేత జగన్ సీఎం అవ్వడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం పలమనేరులో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఆయన మాట్లాడుతూ 15 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ తర్వాతే ఎవరన్నా అని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు మోసపోయారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్