గంగవరం కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 5 నుంచి 13వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 4న సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.