గంగవరం మండలంలోని దండపల్లి కురప్పల్లి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ పార్వతమ్మ భర్త నాగరాజు గౌడ్ మృతికి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. శనివారం స్థానిక టీడీపీ నేతలతో కలసి నాగరాజు గౌడ్ భౌతిక కాయనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట నాయకులు సోమశేఖర్ గౌడ్, కిషోర్ గౌడ్ తదితరులు ఉన్నారు.