వైసీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో పలమనేరుకు చెందిన మాజీ గంగమ్మ గుడి ఛైర్మన్ నరేష్ కు చోటు కల్పించారు. వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శిగా ఆయన్ను అధిష్ఠానం నియమించింది. వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నరేశ్ కు రాష్ట్ర స్థాయిలో చోటుదక్కడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఈ పదవిని అప్పగించిన మాజీ ఎమ్మెల్యే వేంకటే గౌడుకు, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నరేశ్ ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.