పలమనేరు మున్సిపాలిటీ, బోడిరెడ్డిపల్లిలో శ్రీ బోయకొండ గంగమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఉదయం నుంచి అష్టబందన, హోమాలు, అభిషేకాలు, పూర్ణాహుతి, అష్టావదానసేవ, గోవు దర్శనం, సప్త కన్యల దర్శనం, మహామంగళ హారతులుతో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు.