పలమనేరు: పెండింగ్ జీతాలు చెల్లించాలి

67చూసినవారు
పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే 15 మంది కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మూడు నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సంతోషంగా జాతర చేసుకుంటుంటే తాము మాత్రం జీతాలు రాక, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే తమ పెండింగ్ జీతాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్