పలమనేరు: ప్రత్యేక యోగా కార్యక్రమం

75చూసినవారు
యోగాంధ్ర-2025లో భాగంగా పలమనేరులోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్. వి రమణారెడ్డి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, మహిళా మండలి సభ్యులు యోగా సాధన చేశారు. యోగాతో ఎన్నో వ్యాధులు నయం అవుతాయని కమిషనర్ తెలిపారు. యోగ చేయడాన్ని అందరూ అలవర్చుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్