పలమనేరు: విశ్వరూప దర్శనంలో శ్రీ తిరుపతి గంగమ్మ

73చూసినవారు
పలమనేరు పట్టణంలో శ్రీ తిరుపతి గంగమ్మ జాతర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారు భక్తులకు గురువారం విశ్వరూప దర్శనం ఇచ్చారు. అనంతరం అమ్మవారికి అర్చకులు కళ్యాణోత్సవం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్