పలమనేరు అటవీ పరిధి దొర చెరువు వద్ద అతికిరాతి కొండపై బుధవారం అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఎవరైనా నిప్పు పెట్టారా లేక మరి ఇంకేదైనా కోణం ఉందో తెలియాల్సి ఉంది. జంతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ. కొంతమంది ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టడం వలన వన్యప్రాణుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలపై నిఘా ఉంచి వన్యప్రాణులను కాపాడాల్సిందిగా కోరారు.