పలమనేరు: పట్టు రైతుకు అందని ప్రోత్సాహం

54చూసినవారు
పలమనేరు: పట్టు రైతుకు అందని ప్రోత్సాహం
పలమనేరు నియోజకవర్గంలో పట్టుగూళ్ల ఉత్పత్తి తక్కువైపోతోంది. ఐదేళ్ల క్రితం 15 వేల ఎకరాల్లో సాగు సాగితే, ఇప్పుడు అది 1200 ఎకరాలకే పరిమితమైంది. ధరలు లేక, ప్రోత్సాహక నగదు రాక రైతులు మల్బరీ సాగును వదులుకుంటున్నారు. రూ.2 కోట్ల బకాయిలు ఉండగా, పాలకులు పట్టించుకోవడం లేదని వారు గళమెత్తుతున్నారు. షెడ్లకు రాయితీపై ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్