పలమనేరు: యోగాతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి

65చూసినవారు
పెద్దపంజాణి మండలం పెద్దారిగుంట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం యోగాంధ్ర నిర్వహించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని పాఠశాల హెచ్ఎం శంకర్ రెడ్డి అన్నారు. యోగా సాధన చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయన్నారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, శారీరక దృఢత్వం పెంచుకోవచ్చన్నారు. అనంతరం విద్యార్థులతో యోగాసనాలు వేయించారు.

సంబంధిత పోస్ట్