పలమనేరు డిపోకు పూర్వవైభవం తెస్తా: ఎమ్మెల్యే

81చూసినవారు
పలమనేరు డిపోకు పూర్వవైభవం తెస్తా: ఎమ్మెల్యే
పలమనేరు ఆర్టీసీ డిపోనకు 40 ఏళ్ల పైబడిన చరిత్ర ఉందని, అలాంటి డిపోను గత పాలకులు నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శనివారం మండిపడ్డారు. స్థానిక టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ ఉన్న ఈ డిపో నుంచి పలు బస్సులను వివిధ ప్రాంతాలకు తరలించారని మండిపడ్డారు. పలమనేరు నుంచి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లిన బస్సులను తిరిగి రప్పించి డిపోనకు పూర్వ వైభవం తెస్తామన్నారు.

సంబంధిత పోస్ట్