అటవీ అధికారులపై వైసీపీ నేత దాడి

1914చూసినవారు
అటవీశాఖ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులపై వైసీపీ నాయకుడు దాడికి దిగిన ఘటన బైరెడ్డిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి చెకోపోస్ట్ ఏరియాలో అటవీశాఖ స్థలంలో వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సుధాకర్ రెడ్డి వారిపై దాడికి దిగి పక్కకు నెట్టివేసినట్లు అటవీ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్