వి. కోట పట్టణంలో గత 34 ఏళ్లుగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వేల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపి పదవీ విరమణ పొందిన డాక్టర్ కవి కోకిల కొఠారి వెంకటరత్నం మరియు డాక్టర్ గడ్డం శాంత కుమారి సేవలు మరువలేనివని యం. డి. హెచ్. ఫౌండేషన్ అధినేత డాక్టర్. యం. డి. హెచ్. పవన్ కళ్యాణ్ గురువారం కొనియాడారు. మాతృభాషైన తెలుగు భాషకు తలమాణికంగా అనేక సేవలు అందించి జాతీయ రాష్ట్రస్థాయిలలో అనేక సత్కారాలు, సన్మానాలు పొంది పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.