పీలేరు మండలం కాకుళారం పల్లి అగ్రహారంలో 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఏనుగుల మంద దాడుల్లో 11 మంది రైతుల నష్టపోయారు. కలికిరి మండలం నగిరిపల్లిలో మంగళవారం ₹ 1. 16 లక్షల పరిహారం చెక్కులను పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు, ఎఫ్ఎస్ఓ సుధాకర్, ఎఫ్‌బిఓ జ్యోతి పాల్గొన్నారు.