కలకడ మండలంలోని బండమీద పల్లి ఎస్సీ కాలనీలో డీఎస్పీ కృష్ణమోహన్ ఎస్సీ, ఎస్టీ కేసును విచారించారు. కాలనీకి చెందిన రెడ్డప్పపై అగ్రవర్ణాలకు చెందిన గత నెల 17వ తేదీ దాడి చేశారని 19వ తేదీ కేసు నమోదు చేశారు. రెడ్డప్ప కుటుంబాన్ని డీఎస్పీ పరామర్శించి సాక్షులను విచారించారు. ఎస్ఐ రామాంజనేయులు, దళిత సంఘం నాయకులు శ్రీనివాసులు, కృష్ణయ్య, రవీంద్ర పాల్గొన్నారు.