గుర్రంకొండ మండలం ఎల్లుట్ల గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. గురువారం హంద్రీనీవా పరిసర ప్రాంతంలో 14 మంది జూదరులను అరెస్టు చేశారు. అనంతరం వారి వద్ద నుండి రూ. 42, 85042,850 నగదు, మోటర్ బైకులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామని ఎస్సై మధు తెలిపారు.