రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గుర్రంకొండలో టీడీపీ నాయకుల సంబరాలు గురువారం అంబరాన్ని అంటాయి. మండల టీడీపీ అధ్యక్షుడు జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన, బీజేపీ కార్యకర్తలు కలిసి స్థానిక బస్టాండ్ లో కేకులు కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. ఇంకా రాబోయే కాలంలో కూడా చంద్రబాబు, లోకేష్ ప్రజలను అన్ని రకాల ఆదుకుంటారని నాయకులు కొనియాడారు.