గుర్రంకొండ మండల కేంద్రమైన పోలేరమ్మ జాతర శుక్రవారం నుంచి ప్రారంభించారు. శుక్రవారం సాయంకాలం గుర్రంకొండ లోని పలువురు మహిళలు పోలేరమ్మకు బోనాలు సమర్పించారు. పోలేరమ్మ సోదరి శిలోమాతమ్మకు డీలు బోనాలు సమర్పించారు. శనివారం రాత్రి తిరునాళ్ల సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి చాందిని బండ్లు పోలేరమ్మ ఆలయానికి తరలి వస్తారని ఆలయ నిర్వహణలు తెలిపారు. ఈ పోలేరమ్మ జాతరకు ఆలయ కమిటీ ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది.