గుర్రంకొండ మండలం చెర్లోపల్లిలో వెలసిన పూర్వకాలం నుండి సంతాన లక్ష్మిగా పూజలు అందుకుంటున్న రెడ్డమ్మ కొండ ఆలయంలో గురువారం అంగరంగ వైభవంగా వేదమంత్రాలతో పున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతాన లక్ష్మి విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేపట్టడంతో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తరువాత పురోహితులు పళ్ళు, ప్రత్యేక పూజలు హోమాలు కార్యక్రమాలను సాయంకాలం వరకు నిర్వహించారు.