కలికిరి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రానికి గురువారం భారత వ్యవసాయ పరిశోధన మండలి నుండి ఆరు మంది శాస్త్రవేత్తలతో కూడిన క్యూఆర్‌టి బృందం విచ్చేసింది. వీరికి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త మంజుల స్వాగతం పలికారు. టమాటో పంట ప్రదర్శన, క్షేత్ర పరిశీలన పై సమీక్ష నిర్వహించారు. డాక్టర్ చక్రవర్తి వివిధ పంటలలో సంస్థ చేపట్టే ముఖ్యమైన విధులను వివరించారు.