కె. వి పల్లి మండలం తిమ్మాపురం గ్రామంలో మంగళవారం ఒకే వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు. ఇసుక రవాణా నేపథ్యంలో జరిగిన గొడవలో మొత్తం ఐదు మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పీలేరు 108 సిబ్బంది పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో రవి, తేజస్, శ్రావణి, భారతి, వెంకటరమణ ఉన్నారు. కె. వి పల్లి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చిన్న రెడ్డప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.