కలకడ మండలంలోని నడిమి చెర్ల లో వెలసిన నలసానమ్మ తిరుణాల భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు నిర్వహించారు. ఏడాదికి ఒకసారి నిర్వహించు తిరుణాలలో చాందిని బండ్లు మేళ తాళాలు వివిధ డ్యాన్సులతో అమ్మవారి జాతరను హోరెత్తించారు. నడిమిచెర్ల అగ్రహారం వడ్డిపల్లి కొత్తపల్లి గ్రామాల భక్తులు బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ ముక్కులను చెల్లించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.