కలికిరి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1971-72 సం. లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక శనివారం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలకు కంప్యూటర్, వైఫై పరికరాలు ఉచితంగా విద్యార్థులు అందజేశారు. గురువులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. పాత రోజులను నెమరువేసుకుని కబుర్లు చెప్పుకున్నారు. పాఠశాలలో మొక్కలు నాటారు.