జనసేన పార్టీ కలికిరి మండల అధ్యక్షుడిగా కుక్కామల్లు రవీంద్ర ఎన్నికయ్యారు. ఈ మేరకు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అస్లాంను పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. తనకు పదవి దక్కడానికి సహకరించిన పీలేరు ఇన్‌చార్జ్ బెజవాడ దినేశ్ కు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు.