కలికిరిలో డాక్టర్ కె. మంజుల పర్యవేక్షణలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. మే 29 నుండి జూన్ 12 వరకు కేంద్ర వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ శాఖ, ఐసీఏఆర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, అన్నమయ్య జిల్లాలోని 45 గ్రామ పంచాయతీల్లో 15 రోజులపాటు శాస్త్రవేత్తలు పర్యటించి రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.