కలకడ కస్తూర్బా కళాశాల విద్యార్థిని అంకితకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలెక్టర్ చామకూరి శ్రీధర్, మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభ అవార్డును తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. సోమవారం జరిగిన సైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినికి మెడల్ తో పాటు ప్రశంసా పత్రం రూ. 20 వేలు చెక్కు అందజేసినట్లు తెలిపారు.