ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను అందిద్దాం

57చూసినవారు
ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను అందిద్దాం
ప్రజాస్వామ్యబద్దమైన పాలనను ప్రజలకు అందిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన శుక్రవారం కెవి పల్లి మండలం నుంచి నియోజకవర్గ పర్యటన ప్రారంభించారు. తన విజయం కోసం సహకరించిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇందులో కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్