గుర్రంకొండ మండలంలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాల పంపిణీ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గురువారం పశు వైద్యాధికారి సునీల్ నాయక్, వైద్యులు దీపిక సిబ్బందితో కలిసి గ్రామాలలో పశువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. పశువులకు సంక్రమించే వ్యాధులు, వ్యాధులు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. 30 తేదీ వరకు గ్రామాలలో పశువులకు వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు.