ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో నాయకులు కళ్ళకు గంతలతో నిరసన తెలిపారు. గురువారం పీలేరులో మాలమహానాడు మండల ఉపాధ్యక్షులు బద్ది భానుప్రకాష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు నల్ల గంతలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ మాల, మాలమహానాడు నాయకులు ధనాసి వెంకట్రామయ్య, తదితరులు పాల్గొన్నారు.