కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వాల్మీకిపురం ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. చింతపర్తి గ్రామం మేకలవారిపల్లికి చెందిన రెడ్డి కుమార్ (38) శుక్రవారం కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతనిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.