ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఆచరించడం కోసం ముస్లింలు సిద్ధమౌతున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల కఠోర ఉపవాసాలకు బుధవారం నెలవంక దర్శనంతో తెరపడింది. గురువారం జరిగే రంజాన్ పండుగ వేడుకలు, అ సామూహిక ప్రార్థనల కోసం స్థానిక మదనపల్లి రోడ్డులోని బోదేషావలి దర్గా సమీపంలోని ఈద్గా మైదానాన్ని శుభ్రం చేసి, చలువ పందిళ్లను వేయించారు. ముస్లింలు ఈర్గా చేరుకుని, ఉదయం 8: 30 గంటలకు సామూహిక ఊహిత ప్రార్థన చేయనున్నారు.