పెద్దమండెంలో సోమవారం తెలికపాటి వర్షం కురిసింది. 3 రోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించిందని స్థానికులు అన్నారు. ఈ వానకు వ్యాపారులు, ప్రయాణికులు, పనులకు వెళ్లిన కూలీలు కొద్ది సేపు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షాలు ఖరీఫ్ పంట సాగుకు మేలు చేస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉందని, సురక్షితమైన చోట ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.