ప్రతి ఒక వాహన దారుడు రహదారి భద్రతలు పాటించాలని పీలేరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా పీలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు రహదారి భద్రత గురించి అవగాహన కల్పించారు. మోటార్ బైక్ పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన మంగళవారం సూచించారు. రహదారి భద్రతా నియమాలు, సురక్షిత ప్రయాణానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.