పీలేరు: ప్రమాదం జరిగితే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలి

62చూసినవారు
పీలేరు: ప్రమాదం జరిగితే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలి
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాలని ములకలచెరువు అగ్నిమాపక శాఖ అధికారి నరసింహులు తెలిపారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ములకల చెరువు పట్టణంలో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో ప్రయోగాత్మకంగా చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్