పంచాయతీ కార్మికుల సమస్యలపై పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్పదించడంతో పీలేరు పంచాయతీ కార్మికులు ఎమ్మెల్యే చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు. 25 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం అనుభవిస్తున్న తమ బాధలు శాసనసభలో వివరించినందుకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు.